Raana: రానా రాక కోసమే 'విరాటపర్వం' టీమ్ వెయిటింగ్

  • షూటింగు దశలో 'విరాటపర్వం'
  • నక్సలైట్ పాత్రలో కనిపించనున్న రానా 
  • జానపద గాయనిగా సాయిపల్లవి   

రానా .. సాయిపల్లవి జంటగా 'విరాటపర్వం' అనే సినిమాను దర్శకుడు వేణు ఊడుగుల రూపొందిస్తున్నాడు. 1992 కాలానికి సంబంధించిన సామాజిక సమస్యలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. దగ్గుబాటి సురేశ్ బాబు, చెరుకూరి సుధాకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో, నక్సలైట్ గా రానా .. జానపద గాయనిగా సాయిపల్లవి కనిపించనున్నారు.

సాయిపల్లవికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. రానా కాంబినేషన్లోని సన్నివేశాలను .. పాటలను చిత్రీకరించవలసి వుంది. ప్రస్తుతం రానా అమెరికాలో వున్నాడు .. రెండు వారాల తరువాత ఆయన తిరిగి వస్తాడట. అక్కడి నుంచి ఆయన తిరిగొచ్చిన తరువాత తదుపరి షెడ్యూల్ మొదలవుతుందని అంటున్నారు. 'టబు' కీలకమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను విడుదల చేయనున్నారు.

Raana
Sai Pallavi
  • Loading...

More Telugu News