Jammu And Kashmir: కశ్మీర్ పై మోర్టార్ షెల్స్ ప్రయోగించిన పాకిస్థాన్.. చాకచక్యంగా ధ్వంసం చేసిన భారత్.. వీడియో!

  • జమ్మూకశ్మీర్ లోని పూంఛ్ లో ఘటన
  • 9 మోర్టార్ షెల్స్ ను గుర్తించిన ఆర్మీ
  • షెల్స్ పేలుడుకు కంపించిన ప్రాంతం

జమ్మూకశ్మీర్ విషయంలో ఇంటా, బయట విమర్శలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్ ఆర్మీ ప్రతీకారంతో రగిలిపోతోంది. నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి కశ్మీర్ లోని భారత ఆర్మీ పోస్టులు, గ్రామాలు లక్ష్యంగా దాడికి దిగుతోంది. ఇందులో భాగంగా ఇటీవల పూంఛ్ జిల్లాలోని పలు గ్రామాల లక్ష్యంగా పాక్ మోర్టార్ షెల్స్ ను ప్రయోగించింది. వీటిలో కొన్ని పేలగా, మరికొన్ని పేలలేదు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో భారత ఆర్మీ రంగంలోకి దిగింది.

పూంఛ్ సెక్టార్ లోని సన్డోటే, బసోనీ, బాలాకోటే గ్రామాల పరిధిలో 9 మోర్టార్ షెల్స్( 120 ఎంఎం) స్వాధీనం చేసుకుంది. అనంతరం మెంధార్ ప్రాంతంలో ఓ గుంత తవ్విన భారత ఆర్మీ.. అందులో ఈ మోర్టార్ షెల్స్ ను  నిర్వీర్యం చేసింది. ఈ సందర్భంగా మోర్టార్ షెల్స్ పేలడంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా కంపించింది. ఈ వీడియోను మీరూ చూసేయండి

Jammu And Kashmir
India
Pakistan
Mortar shells
Viral Videos
Twitter
  • Error fetching data: Network response was not ok

More Telugu News