Karnataka: వాట్సాప్ మెసేజ్‌తో దుబాయ్ నుంచి ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
- కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలో ఘటన
- పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
- తాను అంగీకరించనని పోలీసుల ముందు వెల్లడి
ట్రిపుల్ తలాక్‌పై కేంద్రం ఓవైపు కఠిన చట్టం చేసినా దుబాయ్‌లో ఉంటున్న ఓ వ్యక్తి కర్ణాటక రాష్ట్రం శివమొగ్గలో ఉంటున్న తన భార్యకు సింపుల్‌గా చిన్న వాట్సాప్ మెసేజ్‌తో తలాక్ చెప్పేశాడు. దీంతో బాధితురాలు తానీ చర్యను అంగీకరించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించింది.
వివరాల్లోకి వెళితే... శివమొగ్గకు చెందిన ఓ మహిళ భర్త దుబాయ్‌లో ఉంటున్నాడు. ఆమె తన వాట్సాప్‌లో భర్త ట్రిపుల్ తలాక్ ఇచ్చినట్లు పెట్టిన మెసేజ్ చూపి కంగుతింది. వెంటనే లబోదిబో మంటూ శివమొగ్గ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త చర్య అన్యాయమని, తానీ నిర్ణయాన్ని అంగీకరించడం లేదని, తనకు న్యాయం చేయాలని వాపోయింది. అయితే ఆమె భర్త దుబాయ్‌లో ఉండడం వల్ల తామేమీ చేయలేమని శివమొగ్గ పోలీసులు చేతులు ఎత్తేశారు.