Yadgir District: యువతితో ప్రేమ సంభాషణలు.. చిక్కుల్లో మఠాధిపతి

  • యువతితో ప్రేమ సంభాషణలు జరిపిన కణ్వమఠం స్వామీజీ
  • సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ప్రేమ సంభాషణలు
  • దీని వెనుక భారీ కుట్ర ఉన్నట్టు సమాచారం

కర్ణాటక యాదగిరి జిల్లాలోని కణ్వమఠం స్వామీజీ విద్యావారధి తీర్థ చిక్కుల్లో పడ్డారు. ఓ యువతితో ఆయన జరిపిన ప్రేమ సంభాషణలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఓ యువతితో సన్నిహితంగా మాట్లాడటం, ఇద్దరం సహకరించుకుందామని చెప్పడం, ఎవరికీ అనుమానాలు రాకుండా భక్తురాలి రూపంలో రావాలని సూచించడం వంటి సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. సదరు యువతి తరచుగా మఠానికి వచ్చేదని, ఈ క్రమంలో స్వామీజీకి ఆమెతో పరిచయం పెరిగిందని,  ఆ తర్వాత అది ప్రేమగా మారిందని అంటున్నారు. మరోవైపు, స్వామీజీకి సన్నిహితంగా ఉన్నవారే కుట్రలకు పాల్పడినట్టు సమాచారం.

దీని వెనుక భారీ కుట్రే ఉందని కొందరు అంటున్నారు. వాట్సాప్ లోని ఫొటోలు చూపకుండా సదరు యువతి జాగ్రత్త పడిందని చెబుతున్నారు. స్వామీజీని ఆమె కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు సమాచారం. మరోవైపు తనపై జరుగుతున్న ప్రచారంపై స్వామీజీ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలు రుజువయ్యేంత వరకు మఠాధిపతిగా కొనసాగనని చెప్పారు. ధ్యానంలోకి వెళ్తానని ప్రకటించారు.

Yadgir District
Kanwa Matham
Swamy
  • Loading...

More Telugu News