Yudh Abhyas 2019: 'జనగణమన' గీతాన్ని అద్భుతంగా వినిపించిన అమెరికా ఆర్మీ బ్యాండ్... వీడియో వైరల్

  • వాషింగ్టన్ లో ఇరు దేశాల సంయుక్త సైనిక విన్యాసాలు
  • భారీ ఎత్తున కొనసాగుతున్న సంయుక్త మిలిటరీ ట్రైనింగ్
  • జాయింట్ ఎక్సర్ సైజ్ జరుగుతుండటం ఇది 15వ సారి

అమెరికన్ ఆర్మీ భారతీయుల మనసులను దోచుకుంది. వాషింగ్టన్ లో భారత్-అమెరికా సైన్యం నిర్వహిస్తున్న సంయుక్త విన్యాసాల సందర్భంగా... అమెరికన్ ఆర్మీ బ్యాండ్ మన జాతీయగీతమైన 'జనగణమన' ను అద్భుతంగా వాయించింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యుద్ధ్ అభ్యాస్-2019 విన్యాసాల సందర్భంగా వాషింగ్టన్ లోని లూయీస్ మెక్ కార్డ్ బేస్ లో మన జాతీయగీతాన్ని ఆలపించారు. ఇరు దేశాల రక్షణ ఒప్పందాల్లో భాగంగా... ఈ బేస్ లో సంయుక్త మిలిటరీ ట్రైనింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇరు దేశాల మధ్య ఇక్కడ జాయింట్ ఎక్సర్ సైజ్ జరుగుతుండటం ఇది 15వ సారి కావడం గమనార్హం.

Yudh Abhyas 2019
USA
India
Army Band
Jana Gana Mana
  • Error fetching data: Network response was not ok

More Telugu News