Odisha: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొడుకు.. కోడలికి మరో పెళ్లి చేసిన మామ

  • కోడలు పడుతున్న కష్టాలు చూసి చలించిన పోయిన మామ
  • తండ్రిలా మారి మరో పెళ్లి చేసిన వైనం
  • తనకున్న రెండెకరాల పొలాన్ని కట్నంగా ఇచ్చేసిన కమల్

కొడుకు మృతి చెందడంతో వితంతువుగా మారిన కోడలికి తండ్రిలా మారి పునర్ వివాహం జరిపించాడో మామ. ఒడిశాలోని నబరంగ్‌పూర్ జిల్లాలోని ఎకోరిగావూన్ గ్రామంలో జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన కమల్‌లోచన్ మఝీ కుమారుడు లలిత్-నైనాలకు 2013లో వివాహమైంది. ఏడాది తర్వాత వీరికి ఓ బిడ్డ పుట్టాడు. అయితే, ఆ తర్వాత కొన్నాళ్లకే ఓ రోడ్డు ప్రమాదంలో లలిత్ ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి కోడలు పడుతున్న కష్టాలు చూసి కరిగిపోయిన కమల్ లోచన్ ఆమెకు వివాహం చేయాలని తలపోశాడు. అనుకున్నదే తడవుగా ఓ సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేశాడు. తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిని కట్నంగా ఇచ్చి ఆమెకు తండ్రిలా మారాడు.

Odisha
nabarangpur
daughter-in-law
marriage
  • Loading...

More Telugu News