Mamata Banerjee: నేడు అమిత్ షాతో భేటీ కానున్న దీదీ

  • నిన్న మోదీతో భేటీ అయిన మమత
  • కుర్తా, మిఠాయిలు బహూకరణ
  • పశ్చిమబెంగాల్ పేరు మార్పుపై చర్చ

కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధినేత అమిత్ షాతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు భేటీ కానున్నారు. ప్రధాని మోదీతో నిన్న ఆమె సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపిన దీదీ... ఆయనకు కుర్తా, మిఠాయిలు బహూకరించారు. పశ్చిమబెంగాల్ పేరు మార్పుపై ప్రధానితో చర్చించారు. సుమారు అరగంట సేపు వీరి సమావేశం కొనసాగింది. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, తమ భేటీలో రాజకీయాంశాలు ప్రస్తావనకు రాలేదని... కేవలం అభివృద్ధి అంశాలపైనే చర్చించామని తెలిపారు.

Mamata Banerjee
Amit Shah
Narendra Modi
BJP
TMC
  • Loading...

More Telugu News