Uttar Pradesh: కుమారుడికి ఉద్యోగం, తనకు పింఛన్ వస్తుందని.. భర్తను ముక్కలుగా నరికి చంపిన భార్య

  • ఉత్తరప్రదేశ్‌లోని అహ్మద్‌నగర్‌లో ఘటన
  • పాఠశాలలో ప్యూన్‌గా పనిచేస్తున్న తేజ్‌రామ్
  • కుమారుడు కపిల్‌తో కలిసి హత్య

పదవీ విరమణకు ముందే భర్తను హతమారిస్తే అతడి ఉద్యోగం కుమారుడికి, తనకు పింఛన్ వస్తుందని భావించిన భార్య.. భర్తను దారుణంగా హతమార్చింది. ఉత్తరప్రదేశ్‌లోని అహ్మద్‌నగర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సీహీ బబుపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో తేజ్‌రామ్ ప్యూన్‌గా పనిచేస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో అతడు పదవీ విరమణ చేయాల్సి ఉంది.

 అయితే, పదవీ విరమణ కంటే ముందే భర్త చనిపోతే తన కుమారుడికి ఉద్యోగం వస్తుందని, తనకు పింఛన్ వస్తుందని భావించిన భార్య మమైవతి కుమారుడు కపిల్‌తో కలిసి భార్యను అంతమొందించింది. ఆపై ముక్కలుగా నరికి గోనె సంచిలో వేసి ఊరిబయట చెత్తకుప్పలో పడేసింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Uttar Pradesh
ahmednagar
murder
  • Loading...

More Telugu News