Andhra Pradesh: ఈ నెల 28 నుంచి ఏపీలో దసరా సెలవులు.. ఖరారు చేసిన విద్యాశాఖ

  • ఈ నెల 28 నుంచి అక్టోబరు 9 వరకు సెలవులు
  • సెలవుల్లో తరగతులు నిర్వహించే విద్యాసంస్థలపై కఠిన చర్యలు
  • 13 వరకు పొడిగించాలంటున్న ఉపాధ్యాయ సంఘాలు

ఈ నెల 28 నుంచి ఏపీలో దసరా సెలవులను ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబరు 9 వరకు సెలవులను ప్రకటించగా, తిరిగి 10న పాఠశాలలు తెరుచుకోనున్నట్టు విద్యాశాఖ తెలిపింది. అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు ఇది వర్తిస్తుందని, సెలవుల రోజుల్లో తరగతులు నిర్వహించే విద్యా సంస్థలపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అయితే, అక్టోబరు 10, 11 తేదీలను కూడా సెలవులుగా ప్రకటిస్తే 12న రెండో శనివారం, 13 ఆదివారం కాబట్టి అప్పటి వరకు సెలవులు పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. వీరి అభ్యర్థనకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే పాఠశాలలు తిరిగి 14న పునఃప్రారంభం అవుతాయి. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

Andhra Pradesh
dasara holidays
schools
  • Loading...

More Telugu News