Janasena: బీజేపీలో చేరిన ‘జనసేన’ గిరిజన నేత రాజారావు

  • కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో బీజేపీలో చేరిక
  • రాజారావుకు, అనుచరులకు కండువాలు కప్పిన కన్నా
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానం

జనసేన పార్టీ నుంచి బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, ‘జనసేన’ గిరిజన నేత రాజారావు, తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో వీరు బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరిని ఆయన సాదరంగా బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ, ప్రజలు స్పష్టమైన మెజార్టీతో గెలిపించినా సీఎం జగన్ ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. కోడెల మృతిని రాజకీయం చేయడం సరికాదని అన్నారు.

Janasena
BJP
Kanna
Lakshmi Narayana
Jagan
  • Loading...

More Telugu News