Prime Minister: మోదీ విమానం పాక్ గగనతలంపై నుంచి వెళ్లేందుకు అనుమతి నిరాకరణ!

  • న్యూయార్క్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ
  • తమ గగనతలం గుండా వెళ్లేందుకు వీళ్లేదన్న పాక్
  • భారత రాయబార కార్యాలయానికి తెలిపిన పాకిస్థాన్

భారత ప్రధాని మోది త్వరలో న్యూయార్క్ పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే, పాకిస్థాన్ గగనతలం గుండా వెళ్లేందుకు మోదీ విమానానికి అనుమతి ఇవ్వలేదు. అనుమతి నిరాకరిస్తున్నట్టు పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషి ప్రకటించారు. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయానికి తెలిపారు. కాగా, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇటీవల మూడు దేశాల పర్యటనకు వెళ్లినప్పుడు కూడా పాక్ గగనతలంపై నుంచి వెళ్లేందుకు అనుమతించలేదు. పాకిస్థాన్ తాజా నిర్ణయంతో భారత్ పై విషం చిమ్ముతోందన్న విషయం స్పష్టం అర్థమవుతోంది.  

Prime Minister
Narendra Modi
Pakistan
Khureshi
  • Loading...

More Telugu News