Chiranjeevi: దుమ్మురేపేస్తోన్న 'సైరా' ట్రైలర్

  • రేనాటి వీరుడి కథగా 'సైరా'
  • భారీ తారాగణం మరో బలం 
  • అక్టోబర్ 2వ తేదీన సినిమా విడుదల      

ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధభేరీ మోగించిన రేనాటి వీరుడు నరసింహారెడ్డి జీవితచరిత్రను 'సైరా' చిత్రంగా రూపొందించారు. చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నిర్మితమైన ఈ సినిమాను అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు.  ఇటీవలే పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ తో ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదలగా, అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. 'రేనాటి వీరులారా చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కానీ చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి' అంటూ చిరూ చెప్పిన డైలాగ్ టీజర్లో హైలైట్ అయింది.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఆంగ్లేయులపై నరసింహారెడ్డి తిరుగుబాటు .. నరసింహారెడ్డి ఆచూకీ కోసం ఆంగ్లేయులు అక్కడి ప్రజలను హింసించడం ఈ ట్రైలర్లో చూపించారు. "స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తోన్న తిరుగుబాటు .. నా భరతమాత గడ్డమీద నిలబడి హెచ్చరిస్తున్నా .. నా దేశం వదిలి వెళ్లిపోండి .. లేదా .. యుద్ధమే" అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలను పెంచడానికి టీమ్ చేసిన ప్రయత్నం నెరవేరిందనే చెప్పాలి.

  • Loading...

More Telugu News