Congress: టీ-కాంగ్రెస్ లో తలెత్తిన విభేదాలు.. ఉత్తమ్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని రేవంత్ డిమాండ్!

  • నేతల మధ్య చిచ్చుపెట్టిన హుజూర్ నగర్ ఉపఎన్నిక అంశం
  • పార్టీ అభ్యర్థిగా పద్మావతి పేరును ప్రకటించిన ఉత్తమ్
  • దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి

టీ-కాంగ్రెస్ లో విభేదాలు తలెత్తాయి. హుజూర్ నగర్ ఉపఎన్నిక అంశం నేతల మధ్య చిచ్చుపెట్టింది. ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పద్మావతి పేరును టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ప్రకటించడంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. హైకమాండ్ కు చెప్పకుండా ఆమె పేరు ఎలా ప్రకటిస్తారని రేవంత్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియాను ఆయన కలిశారు. ఉత్తమ్ కు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. రేవంత్ అభ్యంతరాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని కుంతియా చెప్పినట్టు తెలుస్తోంది.

Congress
Revanth Reddy
Uttam Kumar Reddy
Pcc
  • Loading...

More Telugu News