YSRCP: కోడెల అంతిమయాత్ర: వైసీపీ ఎమ్మెల్యే ఆసుపత్రి వైపు దూసుకెళ్లేందుకు టీడీపీ కార్యకర్తల యత్నం!

  • మల్లమ్మసెంటర్ లో టీడీపీ కార్యకర్తల ఆందోళన  
  • టీడీపీ కార్యకర్తలను అదుపు చేసిన పోలీసులు, నేతలు
  • కొనసాగుతున్న కోడెల అంతిమయాత్ర

నరసరావుపేటలో కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి చెందిన ఆసుపత్రి వైపు టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లే యత్నం చేశారు. మల్లమ్మ సెంటర్ లో టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దూసుకెళ్లేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు, ఆ పార్టీ నేతలు అదుపు చేశారు. కాగా, కోడెల అంతిమయాత్ర కొనసాగుతోంది. సందర్భంగా నరసరావుపేట జనసంద్రంగా మారింది. అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేతలు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, పలువురు నేతలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

YSRCP
Narasaraopet
Mla
Gopireddy
Kodela
  • Loading...

More Telugu News