Andhra Pradesh: ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక: మంత్రి మేకపాటి

  • విశాఖపట్టణంలో వాణిజ్య సదస్సు
  • హాజరైన మంత్రులు, 30 దేశాలకు పైగా ప్రతినిధులు
  • పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి సీఎం జగన్ ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. విశాఖపట్టణంలో ఈరోజు ప్రారంభమైన వాణిజ్య సదస్సుకు మంత్రులు గౌతమ్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ రఘురామ కృష్ణంరాజు హాజరయ్యారు. ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. విశాఖపట్టణంలో ఆక్వాలాబ్ ఏర్పాటు ప్రతిపాదన ఉందని, విశాఖ పారిశ్రామిక అభివృద్ధి దశలో ఉందని, గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉందని అన్నారు.  ఈ సదస్సుకు 30కి పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు, పెట్టుబడిదారులు హాజరయ్యారు.  

Andhra Pradesh
Jagan
cm
Minister
Mekapati
  • Loading...

More Telugu News