Aircraft carrier ins vikrant: తీవ్ర భద్రతా వైఫల్యం.. ఐఎన్ఎస్ విక్రాంత్ లోని హార్డ్ డ్రైవ్ లు, ప్రాసెసర్లు, ర్యామ్ చోరీ!

  • కేరళలోని కొచ్చి షిప్ యార్డులో ఘటన
  • నాలుగు కంప్యూటర్లను ధ్వంసం చేసిన దుండగులు
  • తెలిసిన వ్యక్తులే చేసుంటారని అనుమానం

భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న విమాన వాహక యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్. తాజాగా ఈ నౌకలో చోరీ జరిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకకు ప్రస్తుతం కేరళలోని కొచ్చి షిప్ యార్డ్ లో తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ నౌకలోని నాలుగు కంప్యూటర్లను ధ్వంసం చేసిన దుండగులు అందులోని హార్డ్ డ్రైవ్ లు, ర్యామ్, ప్రాసెసర్లను ఎత్తుకెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు నిఘావర్గాలు కూడా ఈ విషయమై రంగంలోకి దిగాయి.

కంప్యూటర్ల నుంచి హార్డ్ డ్రైవ్ చోరీ జరిగిన ప్రాంతంలో సీసీటీవీలు లేవని షిప్ యార్డ్ అధికారులు చెబుతున్నారు. ఈ నౌకకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(సీఐఎస్ఎఫ్) భద్రతను కల్పిస్తోంది. కాగా, సీసీటీవీ లేదని తెలిసిన వ్యక్తులే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  

  • Loading...

More Telugu News