Kurnool District: ఎడతెగని వర్షాలకు మహానందిలో రోడ్లు జలమయం.. కొట్టుకువచ్చిన మొసలి!

  • సలీమ్ నగర్ వీధుల్లో మోకాలి లోతు వరకు వరదనీరు
  • నీటిలో తిరుగుతున్న మొసలిని గమనించిన స్థానికులు
  • మొసలిని బంధించిన అటవీశాఖ సిబ్బంది

మొన్నటి నుంచి కర్నూలు జిల్లా మహానందిలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో, మహానందిలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. గ్రామాల్లోకి వరద నీటితో పాటు మొసళ్లు, పాములు వచ్చి చేరుతున్నాయి. స్థానిక సలీమ్ నగర్ వీధుల్లో సుమారు మోకాలి లోతు వరకు నిలిచిన నీటిలో మొసలి ఉండటాన్ని స్థానికులు గమనించారు.అయితే, నీటిలో తిరుగుతున్న మొసలిని మొదట ఏదో చేప అనుకున్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

వరద నీటిలో మొసలి కొట్టుకువచ్చిన విషయాన్ని అటవీ శాఖ డివిజనల్ కార్యాలయానికి ఫోన్ ద్వారా స్థానికులు తెలియజేశారు. ఈ సమాచారం మేరకు సలీమ్ నగర్ కు వెళ్లిన అటవీశాఖ సిబ్బంది, మొసలిని బంధించారు. దానిని శ్రీశైలం రిజర్వాయర్ లో వదిలివేస్తామని సిబ్బంది తెలిపారు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News