PUNJAB: చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన దొంగ.. ఒక్క ఉదుటున లేచిన తల్లి.. వీడియో ఇదిగో!

  • పంజాబ్ లోని లూథియానాలో ఘటన
  • సైకిల్ రిక్షాలో బాలిక కిడ్నాప్ కు ప్రయత్నం
  • నిందితుడిని పట్టుకున్న స్థానికులు

చల్లటి గాలికి తన నాలుగేళ్ల చిన్నారితో కలిసి ఓ తల్లి ఆరుబయటే నిద్రపోయింది. అయితే దీన్ని గమనించిన ఓ కిడ్నాపర్ పాపను ఎత్తుకెళ్లేందుకు ప్లాన్ వేశాడు. చల్లగా వచ్చి చిన్నారిని తన సైకిల్ రిక్షాలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. వెంటనే మేలుకున్న తల్లి ఒక్క ఉదుటన వెళ్లి తన పాపను దగ్గరకు తీసుకుంది. దీంతో కిడ్నాపర్ ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. ఈ ఘటన పంజాబ్ లోని లూథియానాలో చోటుచేసుకుంది.

లూథియానాలో ఓ చిన్నారి తన అమ్మ, నానమ్మతో కలిసి ఆరు బయట నిద్రపోతుండగా, అదే ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి పాపను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ అలికిడికి బాలిక తల్లి మేల్కొని గట్టిగా అరుస్తూ, రిక్షా లోంచి పాపను తీసుకుంది. దాంతో తన రిక్షాలో అతను పరారయ్యాడు. అయితే స్థానికులు అతడిని కొద్దిదూరంలోనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. ఈ విషయమై పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడు పాపను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నాడో ఇంకా తెలియరాలేదని చెప్పారు. బాధిత కుటుంబం ఫిర్యాదు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా సదరు నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. త్వరలోనే అతడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలిస్తామని పేర్కొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News