Kodela: కోడెల అంతిమయాత్ర ప్రారంభం.. పాల్గొన్న చంద్రబాబు, బాలయ్య, లోకేశ్

  • కోడెల నివాసం నుంచి స్వర్గపురి వద్దకు అంతిమయాత్ర
  • 4 కిలోమీటర్ల మేర కొనసాగనున్న అంతిమయాత్ర
  • జనసంద్రమైన నరసరావుపేట రహదారులు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల అంతిమయాత్ర నరసరావుపేటలో ప్రారంభమైంది. కోడెల నివాసం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర కోట సెంటర్, సత్తెనపల్లి రోడ్డు, వినాయక టెంపుల్, బరంపేట, టూటౌన్ పీఎస్, పల్నాడు రోడ్డు, మల్లం సెంటర్, ఐలా బజార్ మీదుగా స్వర్గపురికి చేరుకోనుంది. మొత్తం 4 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర కొనసాగనుంది. ఈ అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్ తో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. భారీగా తరలి వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులతో నరసరావుపేట రోడ్లు జనసంద్రమయ్యాయి.

Kodela
Chandrababu
Nara Lokesh
Balakrishna
Telugudesam
  • Loading...

More Telugu News