Andhra Pradesh: కోడెలను చంద్రబాబు వాడుకుని వదిలేశారు!: విజయసాయిరెడ్డి ఘాటు విమర్శలు

  • కోడెల మరణాన్ని బాబు రాజకీయం చేశారు
  • ఆయన ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారు
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శల దాడి కొనసాగుతోంది. కోడెల శివప్రసాదరావు మరణాన్ని రాజకీయం చేసిన చంద్రబాబు, ఆయన ఆత్మకు శాంతిలేకుండా చేస్తున్నారని సాయిరెడ్డి దుయ్యబట్టారు.

గతంలో తాను కొనుగోలు చేసిన 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కోడెలను వాడుకున్న చంద్రబాబు, ఆ తర్వాత వదిలేశాడని విమర్శించారు. నమ్మినవారు ఆపదలో తనకు అండగా నిలవలేదన్న నిస్పృహతోనే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Twitter
kodela
  • Error fetching data: Network response was not ok

More Telugu News