Kodela: జనసంద్రంగా మారిన నరసరావుపేట!

  • మరికాసేపట్లో కోడెల అంత్యక్రియలు
  • భారీగా తరలివచ్చిన అభిమానులు
  • కోడెల అంత్యక్రియలకు హాజరుకానున్న చంద్రబాబు

తమ ప్రియతమ నేత కోడెల శివప్రసాదరావును కడసారి చూసేందుకు వచ్చిన అభిమాన జనంతో నరసరావుపేట పట్టణం జనసంద్రంగా మారింది. నరసరావుపేటలోని నివాసంలో కోడెల పార్థివదేహానికి కార్యకర్తలు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. మరికాసేపట్లో కోడెల అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

కోట సెంటర్ నుంచి కిలోమీటర్ దూరంలో గుంటూరు రోడ్డులో ఉన్న స్వర్గపురి శ్మశానవాటికలో కోడెల అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కోట సెంటర్ ప్రజానీకంతో కిక్కిరిసిపోయింది. ప్రధాన రహదారులన్నీ టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో నిండిపోయాయి. కాగా, తమ సహచరుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఇతర సీనియర్ నేతలు నరసరావుపేట వస్తున్నట్టు తెలిసింది.

Kodela
Narasaraopet
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News