Kodela: కోడెలకు నివాళి అర్పించిన వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు

  • కాసేపట్లో కోడెల అంత్యక్రియలు
  • ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
  • కోడెల పార్థివదేహానికి నివాళి అర్పించిన లావు శ్రీకృష్ణదేవరాయలు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. నరసరావుపేటలో కోడెల అంత్యక్రియలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఆయన భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు. వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా కోడెల పార్థివ దేహాన్ని దర్శించుకుని నివాళి అర్పించారు. కోడెల కుమారుడిని ఓదార్చారు. మరోవైపు నరసరావుపేటలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

Kodela
Lavu Srikrishna Devarayalu
Telugudesam
YSRCP
  • Loading...

More Telugu News