Kodela: కోడెలను హత్య చేసింది ప్రభుత్వమే.. అధికారిక లాంఛనాలు ఎందుకు?: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • ప్రభుత్వం వేధిస్తోందని నా ముందు కోడెల ఏడ్చారు
  • గాల్లోకి పోలీసులు కాల్పులు జరిపినంత మాత్రాన కోడెల ఆత్మ శాంతిస్తుందా?
  • పల్నాడులో టీడీపీని దెబ్బతీయడానికి కోడెలను టార్గెట్ చేశారు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ భౌతికకాయానికి టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కోడెలను హత్య చేసింది ప్రభుత్వమేనని... చేసిందంతా చేసి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ఎందుకని మండిపడ్డారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపినంత మాత్రాన కోడెల ఆత్మ శాంతిస్తుందా? అని మండిపడ్డారు. పల్నాడులో టీడీపీని దెబ్బ తీయడానికి కోడెలను టార్గెట్ చేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని తన ముందు కోడెల ఏడ్చారని తెలిపారు. కోడెలతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని చెప్పారు.

టీడీపీ నేతలపై కేసుల మీద కేసులు పెట్టడం దారుణమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. చివరకు కోడెల అంత్యక్రియలపై కూడా ఆంక్షలు విధించారని... పట్టణంలోకి వచ్చే రహదారులను దిగ్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలను అనుమతించకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారని అన్నారు. సత్తెనపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లో కేబుల్ ప్రసారాలను నిలిపివేశారని దుయ్యబట్టారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News