BJP: నెహ్రూ బ్రిటిషర్ల ట్రాప్ లో పడ్డారు.. దేశాన్ని రెండు ముక్కలుగా విడగొట్టారు!: బీజేపీ నేత విక్రమ్ సైనీ

  • ఆ వంశం మొత్తం అలాంటిదే
  • రాజీవ్ పెళ్లి ఇటలీలో జరిగింది
  • వీరి గురించి నేను మాట్లాడబోను

బీజేపీ నేత, యూపీలోని కతౌలీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీ మాజీ ప్రధాని, దివంగత జవహర్ లాల్ నెహ్రూపై తీవ్ర విమర్శలు చేశారు. బ్రిటిష్ వారి ట్రాప్ లో పడిపోయిన నెహ్రూ దేశాన్ని రెండు ముక్కలుగా(భారత్, పాకిస్థాన్) విడగొట్టారని సైనీ ఆరోపించారు. కానీ మోదీ మాత్రం భారత్ ను బలమైన శక్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని కితాబిచ్చారు.

ఒక్క నెహ్రూ మాత్రమే కాదనీ, ఆయన వంశం మొత్తం అంతేనని దుయ్యబట్టారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విషయమే తీసుకుంటే ఆయన ఓ ఇటలీ వనితను(సోనియా) ఇటలీలోనే పెళ్లి చేసుకున్నారని గుర్తుచేశారు. నెహ్రూ వంశం పనంతా అదేనని స్పష్టం చేశారు. కాబట్టి ఈ కుటుంబం గురించి తాను మాట్లాడదల్చుకోలేదని తేల్చిచెప్పారు.

BJP
Uttar Pradesh
criticise
NEhru family
Vikram singh saini
  • Loading...

More Telugu News