Mamata Banerjee: మోదీ భార్యను కలిసి, చీరను బహూకరించిన మమతా బెనర్జీ

  • రెండు రోజుల పర్యటనకు గాను జార్ఘండ్ వచ్చిన జశోదాబెన్
  • పశ్చిమబెంగాల్ లోని కళ్యాణేశ్వరి ఆలయంలో పూజలు
  • కోల్ కతా విమానాశ్రయంలో జశోదాబెన్ ను కలుసుకున్న దీదీ

ప్రధాని మోదీతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈజు భేటీ కానున్నారు. వీరి భేటీ కంటే ముందే ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మోదీ భార్య జశోదాబెన్ ను మమత కలుసుకున్నారు. కోల్ కతా ఎయిర్ పోర్టులో జశోదాబెన్ ను మమత కలిశారు. ఈ సందర్భంగా ఇరువురూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అనంతరం జశోదాబెన్ కు మమత ఒక చీరను బహూకరించారు.

 జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్ బాద్ కు రెండు రోజుల పర్యటనకు గాను ఆమె వచ్చారు. తన పర్యటనను ముగించుకుని గుజరాత్ వెళ్లేందుకు కోల్ కతా విమానాశ్రయానికి ఆమె వచ్చారు. ఈ సందర్భంగా ఆమెను మమత మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. 16వ తేదీన పశ్చిమబెంగాల్ పశ్చిమ వర్ధమాన్ జిల్లా అసన్ సోల్ లో ఉన్న కళ్యాణేశ్వరి ఆలయాన్ని కూడా ఆమె దర్శించుకున్నారు. జశోదాబెన్ అధ్యాపకురాలిగా పని చేసిన సంగతి తెలిసిందే.

Mamata Banerjee
Jashodaben
Modi Wife
  • Loading...

More Telugu News