Jana Sena: నిబంధనల అతిక్రమణ... జనసేన అనుబంధ ట్విట్టర్‌ ఖాతాల సస్పెన్షన్‌

  • 300 ఖాతాలను తొలగించిన సంస్థ
  • అన్ని ఖాతాలు శతఘ్ని బృందానివే
  • వైసీపీనే కారణమంటున్న జన సైనికులు

జనసేన పార్టీకి షాకింగ్‌ న్యూస్‌. ఆ పార్టీకి అనుబంధంగా పని చేస్తున్న దాదాపు 300 ఖాతాలను  ట్విట్టర్‌ యాజమాన్యం  సస్పెండ్‌ చేసింది. ట్విట్టర్‌ నిబంధనలను అతిక్రమించిన కారణంగా తామీ నిర్ణయం తీసుకున్నామని సంస్థ పేర్కొంది. సస్పెండ్‌ అయిన ఖాతాలన్నీ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న శతఘ్ని బృందానివి కావడం విశేషం.

 గత కొన్ని రోజులుగా జనసైనికులు ట్విట్టర్‌లో 'సేవ్‌ నల్లమల' ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఏపీ సీఎంగా జగన్‌ ఫెయిల్‌ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాలు సస్పెండ్‌ కావడంతో ఇది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పనే అయి ఉంటుందని జనసైనికులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే, సేవ్‌ నల్లమల ఉద్యమం వల్ల ఖాతాలు సస్పెండ్‌ చేసే అవకాశం లేదని చెబుతున్నారు.

Jana Sena
Twitter
300 suspension
YSRCP
  • Loading...

More Telugu News