TRS Leader: వరంగల్ టీఆర్ఎస్ నేతపై కత్తులు, గొడ్డళ్లతో దాడి

  • టీఆర్ఎస్ నేత అంబటి వెంకన్నపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
  • పరిస్థితి విషమం
  • భూ తగాదాలే దాడికి కారణమని భావన

వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత అంబటి వెంకన్నపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. ఈ ఉదయం తెల్లవారుజామున వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో కలసి మార్నింగ్ వాక్ కు వెళ్లిన ఆయనపై దుండగులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో వెంకన్న తీవ్రంగా గాయపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను వరంగల్ లోని ఆసుపత్రికి తరలించారు. దాడిని అడ్డుకునేందుకు యత్నించిన వెంకన్న భార్యపై కూడా దుండగులు చేయి చేసుకున్నారు. ప్రస్తుతం వెంకన్న పరిస్థితి విషమంగా ఉంది. భూ తగాదాలే దాడికి కారణమని భావిస్తున్నారు.

TRS Leader
Attack
Warangal
  • Loading...

More Telugu News