Kodela: కోడెల చనిపోవడానికి ముందు ఫోన్లో ఎవరితోనో మాట్లాడారు!: అంబటి రాంబాబు

  • దాదాపు 25 నిమిషాల సేపు ఫోన్లో మాట్లాడారు
  • ఎవరితో మాట్లాడారో? ఏం మాట్లాడారో?
  • ఈ వాస్తవాలన్నీ బయటకొస్తాయి

కోడెల శివప్రసాద్ చనిపోవడానికి ముందు ఎవరితోనో ఫోన్లో  మాట్లాడారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోడెల ఎవరితోనో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు ఫోన్లో మాట్లాడారని అన్నారు. ఆ ఫోన్ కాల్ ఎవరితో మాట్లాడారు? ఏం మాట్లాడారు? అనే వాస్తవాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ లో బయటకొస్తాయని అన్నారు.

కోడెల మృతి ఘటనకు సంబంధించిన వాస్తవాలన్నీ బయటకొస్తాయి, ఎక్కడా దాగవు అని అన్నారు. కోడెల తమకు రాజకీయ ప్రత్యర్థి తప్ప, వ్యక్తిగత ప్రత్యర్థి కాదని చెప్పారు. చంద్రబాబునాయుడుకే కోడెల వ్యక్తిగత ప్రత్యర్థిగా తయారయ్యారని, ఆయన హెరాస్ మెంట్ వల్లే కోడెల మృతి చెందారని తన అభియోగం అని అంబటి పేర్కొన్నారు.

Kodela
Telugudesam
YSRCP
Ambati rambabu
  • Loading...

More Telugu News