Kodela: చంద్రబాబుకు కోడెల కుటుంబంపై ప్రేమే ఉంటే కనుక ఈ పని చేయాలి!: అంబటి రాంబాబు

  • కోడెల వారసులుగా కొడుకు, కూతురిని ప్రకటించాలి
  • ఒకరిని నరసరావుపేట, మరొకరిని సత్తెనపల్లి నుంచి డిక్లేర్ చేయాలి
  • దొంగనాటకాలు ఆడొద్దని చంద్రబాబుకు మనవి

కోడెల శివప్రసాదరావు కుటుంబంపై చంద్రబాబునాయుడుకి నిజంగా ప్రేమాభిమానాలు ఉంటే, ఆయన వారసులుగా కొడుకుని, కూతురుని ప్రకటించాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోడెల కొడుకు, కూతురిని.. ఒకరిని నరసరావుపేట, మరొకరిని సత్తెనపల్లి నుంచి పోటీ చేయిస్తానని డిక్లేర్ చేయాలని అన్నారు. కేవలం, దొంగనాటకాలు ఆడే పనులు చేయొద్దని చంద్రబాబుకు మనవి చేస్తున్నానని అన్నారు.

అసలు, కోడెల అంత్యక్రియలు అయ్యే వరకూ ఈ విషయాలు మాట్లాడకూదని అనుకున్నామని, అయితే, తమపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని అన్నారు. కోడెల తన జీవితంలో ఎన్ని కేసులు ఎదుర్కొన్నారు, ఈ కేసులు ఒక లెక్కా అని అన్నారు. ఈ కేసులు నైతికంగా కోడెలను పతనం చేశాయని, అలాంటి సమయంలో టీడీపీ నేతలు ఎవ్వరూ ఆయన్ని పట్టించుకోలేదని, అందుకే, ఇలాంటి దారుణమైన పరిస్థితిలో ఆయన మరణించారని అన్నారు. కోడెల మృతికి బాధ్యత వహించాల్సింది ఆయన కుటుంబసభ్యులు, తెలుగుదేశం పార్టీ తప్ప ప్రత్యర్థి రాజకీయపార్టీ కాదని స్పష్టం చేశారు.

Kodela
Chandrababu
Telugudesam
Ambati rambabu
  • Loading...

More Telugu News