Kodela siva prasad: ‘పల్నాటి పులి’ ఎందుకు ఉరి వేసుకున్నాడు?.. కోడెల మృతికి ప్రధాన కారణాలు రెండు!: అంబటి రాంబాబు

  • కోడెలపై కేసులు పెడితే ఎవరిని అయినా అరెస్టు చేశారా?
  • మృతికి కారణం..కుటుంబసభ్యులు, టీడీపీ 
  • కోడెల ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఏదో ఉంది!

‘పల్నాటి పులి’ కోడెల శివప్రసాద్ ఎందుకు ఉరి వేసుకున్నారు? దీనిపై చర్చ జరగాలి, ప్రతి తెలుగువాడు ఆలోచించాలి అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోడెల మృతిపై దుర్మార్గమైన కోణంలో చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు.

‘కోడెలపై కేసులు ఎవరు పెట్టారు? నేను పెట్టానా? జగన్మోహన్ రెడ్డిగారు పెట్టారా? లేక నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి పెట్టారా? కోడెలపై 19 కేసులు పెడితే ఎవరిని అయినా అరెస్టు చేశారా? కోడెలను పోలీస్ స్టేషన్ కు రమ్మనిమని ఎవరైనా అడిగారా?’ అని ప్రశ్నించారు. కోడెల, ఆయన కుటుంబసభ్యులు హైకోర్టుకు వెళ్లి స్టే కూడా తెచ్చుకున్నారని గుర్తుచేశారు.

ఆత్మహత్యకు పాల్పడే మానసిక పరిస్థితిలోకి కోడెల నెట్టబడటం వెనుక  ఏదో ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాలి, ప్రతి తెలుగువాడి ఇంట్లో చర్చ జరగాలని అన్నారు. కోడెల మృతికి గల ప్రధాన కారణాలు వారి కుటుంబసభ్యులు, తెలుగుదేశం పార్టీయే అని ఆరోపించారు.

Kodela siva prasad
Telugudesam
Kodela
Ambati
  • Loading...

More Telugu News