Telugudesam: హత్యలు, ఆత్మహత్యలతో స్వలాభం పొందడం వైఎస్ కుటుంబానికే చెల్లుతుంది: టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్

  • కోడెల మృతిపై స్పందించిన రాజేంద్రప్రసాద్
  • కోడెలను వైసీపీ సర్కారు మానసికంగా వేధించిందని ఆరోపణ
  • దొంగ కేసులు పెట్టి హింసించారని వ్యాఖ్యలు

టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు బలవన్మరణంపై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ స్పందించారు. హత్యలు, ఆత్మహత్యలతో స్వలాభం పొందడం వైఎస్ కుటుంబానికే చెల్లుతుందని అన్నారు. కోడెలను వైసీపీ ప్రభుత్వం మానసికంగా వేధించిందని ఆరోపించారు. ఇప్పుడు కోడెల చనిపోయాక ఆయన ఆత్మ క్షోభించేలా కొడాలి నాని మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్త అయిన కోడెల మేనల్లుడితో అక్రమ కేసులు పెట్టించారని రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న కోడెలపై దొంగ కేసులు పెట్టి హింసించారని వ్యాఖ్యానించారు.

Telugudesam
Rajendraprasad
Kodela
Andhra Pradesh
MLC
  • Loading...

More Telugu News