Kodela siva prasad: కోడెలను ఆయన పిల్లలు సరిగా చూసుకోలేదు: మంత్రి బుగ్గన

  • నరసరావుపేట, సత్తెనపల్లిలో ఎవరిని అడిగినా ఇదే చెబుతారు
  • ఈ విషయం తెలుసుకునేందుకు రీసెర్చి చేయక్కర్లేదు
  •  నిజం దాగదు.. కచ్చితంగా బయటకొస్తుంది

కోడెల శివప్రసాద్ బలవన్మరణానికి వైసీపీ ప్రభుత్వ వేధింపులే కారణమని ఆయన పిల్లలు, టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోడెలను వాళ్ల పిల్లలు సరిగా చూసుకోలేదన్న విషయాన్ని నరసరావుపేట, సత్తెనపల్లిలో ఎవరిని అడిగినా చెబుతారని, ఈ విషయం తెలుసుకోవడానికి రీసెర్చి చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ విషయాలు అందరికీ తెలుసని, చనిపోయిన వ్యక్తి గురించి, ఆయన కుటుంబం గురించి ఇలా చెప్పుకోవడం మంచిదికాదు అన్న ఉద్దేశంతోనే తాను ఎక్కువగా ప్రస్తావించట్లేదని అన్నారు. నిజం దాగదని, కచ్చితంగా బయటకు వస్తుందని చెప్పారు.

Kodela siva prasad
Telugudesam
Minister
Buggana
  • Loading...

More Telugu News