Mallu Bhatti Vikramarka: తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అవుతోందో గవర్నర్ కు వివరించాం: భట్టి విక్రమార్క

  • తెలంగాణ గవర్నర్ ను కలిసిన టీ-కాంగ్రెస్ నేతలు
  • ఫిరాయింపు ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లోకి తీసుకోవడంపై ఫిర్యాదు చేశాం
  • ఎమ్మెల్యేల విలీనం చెల్లదని గవర్నర్ కు చెప్పాం

తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎలా ఖూనీ అవుతోందో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ కు వివరించినట్టు టీ-కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు 12 మందిని టీఆర్ఎస్ లోకి తీసుకోవడంపై ఈ రోజు హైదరాబాదులో గవర్నర్ ను కలసిన కాంగ్రెస్ నేతలు ఆమెకు ఫిర్యాదు చేశారు.

అనంతరం, మీడియాతో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఎమ్మెల్యేల విలీనం చెల్లదని చెప్పామని, తేదీలతో సహా ఫిరాయింపు ఆధారాలను అందజేశామని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం కోర్టులో ఉందని, సబితా ఇంద్రారెడ్డిని కేబినెట్ లోకి తీసుకుని ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తుంగలో తొక్కారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు.

Mallu Bhatti Vikramarka
Tamili sye
Telangana
  • Loading...

More Telugu News