Kodela siva prasad: కోడెల మృతిపై చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు: మంత్రి బుగ్గన

  • ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలి
  • కింది స్థాయి కార్యకర్తల్లా మాట్లాడొద్దు
  • కోడెలకు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి

ఏదైనా సంఘటనపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సూచించారు. కోడెల మృతికి వైసీపీ ప్రభుత్వమే కారణమంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోడెల మృతి ఘటనపై చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. కింది స్థాయి కార్యకర్తల్లా మాట్లాడటం తగదని హితవు పలికారు.

అసెంబ్లీ ఫర్నిచర్ ను తాను తీసుకున్న విషయాన్ని కోడెలే స్వయంగా ఒప్పుకున్నారని, దీనిపై కేసు నమోదు చేయడం తప్ప ఆయన్ని ప్రశ్నించడం గానీ అరెస్టు చేయడం గానీ చేయలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. దీనికే ఎవరైనా అంత మనస్తాపానికి గురవుతారా? అని ప్రశ్నించారు. వ్యక్తిగత సమస్యలు, పార్టీకి సంబంధించిన సమస్యలు కోడెలకు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీలో తనకు సముచిత స్థానం లేదని కోడెల ఎన్నోసార్లు అన్నారని గుర్తుచేశారు. అసలు, 2014లో కోడెలకు టికెట్ ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేదని అన్నారు.

Kodela siva prasad
Chandrababu
Minister
Buggana
  • Loading...

More Telugu News