ASTRA: భారత అమ్ములపొదిలో మరో ఆయుధం.. ‘అస్త్ర’ ప్రయోగం విజయవంతం!
- పశ్చిమబెంగాల్ లో ప్రయోగించిన డీఆర్డీవో
- సుఖోయ్-30 ద్వారా ప్రయోగం
- 70 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించే అస్త్ర
భారత వాయుసేన(ఐఏఎఫ్) ను పటిష్టం చేసే దిశగా మరో ముందడుగు పడింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) అభివృద్ధి చేసిన ‘అస్త్ర’ క్షిపణిని వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. పశ్చిమబెంగాల్ లోని ఓ ఎయిర్ బేస్ నుంచి సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం ద్వారా దీన్ని విజయవంతంగా పరీక్షించారు.
ఈ ప్రయోగాన్ని డీఆర్డీవో, వాయుసేన ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. దీన్ని గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. దాదాపు 70 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను అస్త్ర ఛేదించగలదు. తాజా ప్రయోగంతో భారత వాయుసేన మరింత పటిష్టం కానుంది.