Andhra Pradesh: ఏపీలో కాంట్రాక్టర్లకు జగన్ సర్కారు షాక్.. రూ.1,000 కోట్ల రహదారి పనులు నిలిపివేత!

  • 3,543 రోడ్ల నిర్మాణానికి బ్రేక్
  • ఈ కాంట్రాక్టుల విలువ రూ.వెయ్యి కోట్లకుపైనే
  • పనులు సకాలంలో పూర్తిచేయకపోవడంతో నిర్ణయం

ఇప్పటికే పోలవరం కాంట్రాక్టును రద్దుచేసిన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పంచాయతీరాజ్ శాఖలో భారీస్థాయిలో జరుగుతున్న 3,543 రహదారి పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ పనుల విలువ రూ.1,031.17 కోట్లుగా ఉందని సమాచారం. పంచాయతీరాజ్ తో పాటు ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక కింద చేపడుతున్న పనులను జగన్ సర్కారు నిలిపివేసిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 2018, ఏప్రిల్ కు ముందే అనుమతి పొందినప్పటికీ ఇంకా పనులు ప్రారంభించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.

  • Loading...

More Telugu News