Prahlad Joshi: ఆర్టికల్ 370 రద్దు చేశాం... కశ్మీర్ లోయలో షూటింగులు పెట్టుకోండి: తెలుగు ఫిలింమేకర్లకు సూచించిన కేంద్రమంత్రి

  • కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీని కలిసిన అశ్వనీదత్, నాగ్ అశ్విన్
  • సినీ ప్రముఖులతో ముచ్చటించిన కేంద్రమంత్రి
  • జోషీని కలిసినవారిలో తెలంగాణ బీజేపీ చీఫ్ కె.లక్ష్మణ్

ప్రముఖ తెలుగు నిర్మాత అశ్వనీదత్, యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తదితరులు ఇవాళ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీని కలిశారు. ఈ సందర్భంగా జోషీ తెలుగు సినీ ప్రముఖులతో ముచ్చటించారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 తొలగించామని, ఇప్పుడక్కడ షూటింగ్ లు నిర్వహించుకోవచ్చని వివరించారు. తెలుగు ఫిలింమేకర్లు తమ షూటింగ్ లను కశ్మీర్ లో జరుపుకోవాలని కోరారు. కాగా, కేంద్ర మంత్రిని కలిసినవారిలో తెలంగాణ బీజేపీ చీఫ్ కె.లక్ష్మణ్ కూడా ఉన్నారు.

Prahlad Joshi
Aswinidutt
Nag Aswin
BJP
  • Loading...

More Telugu News