Andhra Pradesh: అధికారిక లాంఛనాలతో ‘కోడెల’ అంత్యక్రియలు.. ఏపీ సీఎం జగన్ ఆదేశం!

  • సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆదేశించిన జగన్
  • అన్ని ఏర్పాట్లు చేయాలని స్పష్టీకరణ
  • నిన్న హైదరాబాద్ లో కన్నుమూసిన కోడెల

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిన్న హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ కోసం సిట్ ఏర్పాటు చేశారు. మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తిచేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోడెల అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఈరోజు నరసరావుపేటకు కోడెల భౌతికకాయాన్ని తరలించనున్నారు. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Andhra Pradesh
kodela
official
Jagan
Chief Minister
Order
  • Loading...

More Telugu News