kodela: కోడెల మరణంపై నిజాలన్నీ త్వరలోనే బయటపడతాయి!: ఏపీ మంత్రి ధర్మాన

  • కుటుంబ విభేదాల కారణంగానే కోడెల ఆత్మహత్య
  • ఈ విషయాన్ని ఆయన మేనల్లుడే చెప్పాడు
  • తెలంగాణ సర్కారు సిట్ ఏర్పాటు చేసింది

కుటుంబంలో నెలకొన్న భేదాభిప్రాయాల కారణంగానే టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు బలవన్మరణం చెందారని ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన మేనల్లుడే చెప్పాడని గుర్తుచేశారు. కోడెల మరణంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) తెలంగాణ సర్కారు నియమించిందని చెప్పారు. మరికొన్ని రోజుల్లోనే వాస్తవాలన్నీ బయటపడతాయని ధీమా వ్యక్తం చేశారు.

కోడెల మరణాన్ని కూడా చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నేత కోడెల నిన్న హైదరాబాద్ లో తన నివాసంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన బసవతారకం ఆసుపత్రికి తరలించగా, అక్కడే తుదిశ్వాస విడిచారు.

kodela
death
Dharmana krishnadas
Andhra Pradesh
Telangana
Police
SIT
  • Loading...

More Telugu News