Andhra Pradesh: ఏపీ, తెలంగాణలో నేడు భారీ వర్షాలు.. హెచ్చరించిన వాతావరణ శాఖ!

  • గోవా, యూపీ, రాజస్థాన్ లోనూ కుండపోత
  • మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఐఎండీ సూచన
  • బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని వెల్లడి

భారత వాతావరణ శాఖ(ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు గోవా, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోను, యానాం, పుదుచ్చేరి వంటి ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, బిహార్, సిక్కిం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనూ తీవ్రవర్షాలు పడతాయని చెప్పింది.

అండమాన్, మాల్దీవుల్లోని సముద్రతీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని పేర్కొంది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని సూచించింది. జార్ఖండ్, సిక్కిం, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం, పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది.

Andhra Pradesh
Telangana
Heavy rains
IMD
Warning
  • Loading...

More Telugu News