ayodhya: అయోధ్య కేసులో మధ్యవర్తిత్వానికి అనుమతి ఇవ్వండి: సుప్రీంలో త్రిసభ్య కమిటీ మెమొరాండం
- సున్నీ వక్ఫ్-నిర్వాణా అఖాడా మధ్య చర్చలకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థన
- రామజన్మస్థలాన్ని కక్షిదారుగా అంగీకరించబోమన్న ముస్లిం పార్టీలు
- రాజ్యాంగ ధర్మాసన విచారణను ఆపాలని కోరుకోవడం లేదన్న కమిటీ
అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఈ కేసులో గతంలో మధ్యవర్తిత్వం నెరిపిన త్రిసభ్య కమిటీ మరోమారు ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్వాణా అఖాడా మధ్య చర్చలు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మెమొరాండం సమర్పించింది. రాజ్యాంగ ధర్మాసన విచారణ ప్రక్రియను ఆపాలని హిందూముస్లిం పక్షాలు కోరుకోవడం లేదని మెమొరాండంలో త్రిసభ్య కమిటీ పేర్కొంది. కాగా, రామజన్మస్థలాన్ని ఓ కక్షిదారుగా అంగీకరించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు ముస్లిం పార్టీల తరపున వాదిస్తున్న రాజీవ్ ధవన్ కోర్టుకు తెలిపారు. దేవుడిని (రాముడిని) కక్షిదారుగా చేర్చినప్పుడు ఆయన జన్మస్థలాన్ని ఓ పార్టీగా ఎలా అంగీకరిస్తారని ఆయన ప్రశ్నించారు.