Chandrababu: కోడెల భయపడిపోయాడు... పిరికితనం వచ్చింది: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

  • ఎన్నో రకాలుగా కోడెలను వేధించారు
  • కోడెలకు భయంతో పిరికితనం వచ్చింది
  • ఓ మనిషిని ఇలా కూడా హత్య చేయవచ్చా
  • ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు

ఎవరైనా ఓ మనిషిని హత్య చేయాలంటే, ఇలా కూడా హత్య చేయవచ్చని తన జీవితంలో తొలిసారి చూసిన ఘటన కోడెల ఆత్మహత్యేనని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం హైదరాబాద్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కోడెల పార్థివ దేహానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

"మనిషిని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా వేధించి, వేధించి, ఇంక దిక్కు లేకుండా చేసి, ఏం చేయాలో ముందుకు పోనీయకుండా... లైఫ్ ను ఎండ్ చేసుకోవడం. ఈ కేసు చూసినప్పుడు... ఒకప్పుడు పల్నాడు పులి. పల్నాడు టైగర్... ఓ ప్రత్యేకమైన గుర్తింపు. అదే విధంగా ప్రజల దగ్గరి నుంచి, క్యాడర్ దగ్గరి నుంచి రికగ్నిషన్. అలాంటి వ్యక్తి... ఈ రోజు భయపడిపోయాడు. పిరికితనం వచ్చింది. ఇంక నేను ఈ అవమానాలు చూసిన తరువాత నేను బతకడం వేస్ట్ అనుకున్నారు" అని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Chandrababu
Kodela
Sucide
  • Loading...

More Telugu News