Kodela: కోడెల వంటి యోధుడు చివరికి రాజకీయ కక్షలకు బలయ్యారు: సీపీఐ నారాయణ

  • కోడెల భౌతికకాయానికి నివాళులు అర్పించిన నారాయణ
  • కోడెల ఎవరికీ భయపడే వ్యక్తి కాదని వెల్లడి
  • వామపక్ష ఉద్యమాలకు మద్దతుగా నిలిచారని గుర్తుచేసుకున్న సీపీఐ నేత

సీపీఐ నేత నారాయణ ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై స్పందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కోడెల భౌతికకాయానికి నివాళులు అర్పించిన సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడారు. తనకు తెలిసినంత వరకు కోడెల ఎవరికీ భయపడే వ్యక్తి కాదని, అయితే రాజకీయ కక్షలు ఆయన్ను బలితీసుకున్నాయని అభిప్రాయపడ్డారు. వామపక్ష ఉద్యమాల పట్ల కోడెల ఎంతో మద్దతుగా ఉండేవారని, కమ్యూనిస్టులను గౌరవించేవారని నారాయణ వెల్లడించారు. కోడెల ఓ యోధుడని, ఇలా జరగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ వామపక్ష నేత చాడ వెంకట్ రెడ్డి కూడా ఇదే తరహా అభిప్రాయాలను వెల్లడించారు. మంచితనానికి మారుపేరు వంటి కోడెల మృతి తమను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.

Kodela
CPI Narayana
Andhra Pradesh
  • Loading...

More Telugu News