Jagan: జగన్ గారూ! కోడెల అంతిమయాత్రను అడ్డుకునేందుకు దిగజారుడు రాజకీయాలా?: నారా లోకేశ్

  • నరసరావుపేట డివిజన్ లో 144 సెక్షన్ విధిస్తారా?
  • కోడెల అంతిమయాత్రను ఆపేందుకేనా?
  • నారా లోకేశ్ ట్వీట్ 

నరసరావుపేట డివిజన్ లో 144 సెక్షన్ విధింపుపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.ఆఖరికి కోడెల అంతిమయాత్రని అడ్డుకునేందుకు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారా? అంటూ సీఎం జగన్ ని ప్రశ్నించారు. అక్రమ కేసులతో కోడెలను మానసికంగా వేధించి ఆయన మృతికి కారణమయ్యారని ఆరోపించారు. ఇప్పుడు ఆయన అంతిమయాత్రను ఆపేందుకు శాంతిభద్రతల పేరుతో నరసరావుపేట డివిజన్ మొత్తం 15 రోజులపాటు 144 సెక్షన్ అమలు చేస్తారా? అంటూ ఓ ట్వీట్ లో ప్రశ్నించారు.

కోడెలది ఆత్మహత్య కాదని, ఇది ముమ్మాటికీ వైసీపీ ప్రభుత్వ హత్యే అని ఆరోపించారు. దీన్ని కప్పిపుచ్చుకోడానికి కుటుంబ కలహాలు అని, కొడుకే కొట్టి చంపారని నిస్సిగ్గుగా ‘మీ దొంగ ఛానల్ లో కథనాలు ప్రసారం చేస్తారా? కోడెలగారి కొడుకు విదేశాల్లో ఉన్న విషయం మీ గుడ్డి సాక్షి ఛానల్ కి కనపడలేదా?’ అంటూ మరో ట్వీట్ చేశారు.

Jagan
Nara Lokesh
kodela
Narasaraopet
  • Error fetching data: Network response was not ok

More Telugu News