Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్, సాక్షి ఛానెల్ పై కేసు రిజిస్టర్ చేయాలి: వర్ల రామయ్య డిమాండ్

  • కోడెల పిరికివాడు, భయస్తుడు కాదు
  • కానీ, కోడెల ఆత్మహత్య చేసుకునేలా చేశారు
  • ‘చచ్చిపో..చచ్చిపో’ అని మీరు ఫోర్స్ చేశారు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణంపై టీడీపీ నేత వర్ల రామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్, సాక్షి ఛానెల్ పై ఆరోపణలు గుప్పించారు. ‘కోడెల పిరికివాడు, భయస్తుడు కాదు. కానీ, కోడెల ఆత్మహత్య చేసుకునేలా మీరు చేశారు. ‘చచ్చిపో..చచ్చిపో’ అని మీరు ఫోర్స్ చేశారు. మీ బాధలు పడలేక, క్షోభ పడలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

 ఏదైనా చిన్న నేరం చేసి ఉంటే యాక్షన్ తీసుకుని ఒక ఛార్జిషీట్ వేయాల్సింది. అలా ఎందుకు చేయలేదు? సమాజంలో ఒక తప్పుడు వాడిగా, నేరస్థుడిగా చేయాలన్న మీ ప్రయత్నం ఆత్మహత్య చేసుకునేలా చేసింది. కోడెల ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు మీరు సృష్టించారు. అందుకే, ఈ ప్రభుత్వంపై కేసు రిజిస్టర్ చేయాలి. 306 ఐపీసీ కింద ఈ ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద, సాక్షి ఛానెల్ మీద కేసు రిజిస్టర్ చేయాలి’ అని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు.

Andhra Pradesh
cm
sakshi
Telugudesam
Varla
  • Loading...

More Telugu News