Balakrishna: ఆసుపత్రిలో కోడెల చివరిక్షణాలను వివరించిన బాలకృష్ణ

  • హైదరాబాద్ లోని తన నివాసంలో కోడెల ఆత్మహత్య
  • ఉరేసుకుని బలవన్మరణం
  • తీవ్ర విషాదంలో బాలయ్య

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణలో తమకు ఎంతో చేదోడువాదోడుగా నిలిచిన కోడెల శివప్రసాదరావు మరణంతో నందమూరి బాలకృష్ణ తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. తాను ఏ ఆసుపత్రి కోసమైతే అహరహం శ్రమించారో అదే ఆసుపత్రిలో కోడెల కన్నుమూయడం బాధాకరం! హైదరాబాద్ లోని తన నివాసంలో ఉరివేసుకున్న కోడెలను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన ప్రాణాలు నిలవలేదు. దీనిపై బాలకృష్ణ మాట్లాడారు.

ఆసుపత్రికి తీసుకువచ్చేటప్పటికి కోడెల పల్స్ బాగా పడిపోయిందని, బీపీ కూడా చెక్ చేశారని తెలిపారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలోకి జారుకున్నారని, దాంతో డాక్టర్లు తీవ్రంగా శ్రమించారని వెల్లడించారు. అయినప్పటికీ కోడెల ప్రాణాలు కాపాడలేకపోయారని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

Balakrishna
Kodela
Andhra Pradesh
Telugudesam
  • Loading...

More Telugu News