sakshi channel: మైడియర్ సాక్షి ఛానెల్! మీకు బుద్ధి ఉందా? సిగ్గు ఉందా?: వర్ల రామయ్య ఫైర్

  • చనిపోయిన వ్యక్తి గురించి అవాకులు చెవాకులు మాట్లాడతారా?
  • రెండు రోజుల క్రితం కోడెల కొడుకు హైదరాబాద్ లో ఉన్నాడా? 
  • ఛాలెంజ్ చేస్తున్నా..ఫ్రూవ్ చేయగల్గుతారా?

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ బలవన్మరణంపై సాక్షి ఛానెల్ లో అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మైడియర్ సాక్షి ఛానెల్.. మీకు ఏమన్నా జ్ఞానం ఉందా? బుద్ధి ఉందా? సిగ్గు ఉందా? చనిపోయిన వ్యక్తి గురించి ఈ రకంగా అవాకులు చెవాకులు మాట్లాడతారా? రెండు రోజుల క్రితం కోడెల కొడుకు హైదరాబాద్ లో ఉన్నట్టు ఫ్రూవ్ చేయగల్గుతారా? ఛాలెంజ్ చేస్తున్నా. కోడెల కొడుకు ఇక్కడ ఉన్నాడా? ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నాడా? ఎవరిని మభ్యపెట్టాలని? కోడెల తప్పు చేసి ఉంటే యాక్షన్ తీసుకోవాల్సింది. కోడెల మీద, కొడుకు మీద, కూతురి మీద పుంఖాను పుంఖాలుగా కేసులు రిజిష్టర్ చేసి ఆయన్ని హెరాస్ చేస్తారా? మానసికంగా క్షోభ పెడతారా? అని నిప్పులు చెరిగారు.

sakshi channel
cm
Jagan
Telugudesam
Varla
  • Loading...

More Telugu News