Kodela siva prasad: తండ్రిని చంపేస్తానని కొడుకు శివరామ్ బెదిరించేవాడు.. కోడెల బంధువు ఫిర్యాదు!

  • కోడెల పేరిట ఉన్న ఆస్తులను శివరామ్ తన పేరిట మార్చమనేవాడు
  • కోడెలను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు
  • కోడెల గతంలో నాకు ఫోన్ చేసి చెప్పారు

కోడెల శివప్రసాదరావు అనుమానాస్పద మృతిపై ఆయన  బంధువు ఒకరు సంచలన ఆరోపణలు చేస్తూ సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కుమారుడు శివరామే తన తండ్రిని హత్య చేశాడని కోడెల  బంధువు  కంచేటి సాయి ఈ ఫిర్యాదులో ఆరోపించారు.

తన పేరిట ఉన్న ఆస్తులను శివరామ్ పేరిట మార్చాలని వేధిస్తున్నాడని, మానసికంగా, శారీరకంగా క్షోభ పెడుతున్నాడని కోడెల గత ఆగస్టులో తనకు పలుసార్లు ఫోన్ చేసి వాపోయారని అన్నారు. శివరామ్ పేరిట కనుక తన ఆస్తులను మార్చకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నాడని, శివరామ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, కాపాడాలని కోడెల తనను వేడుకున్నట్టు తెలిపారు. ఆ తర్వాత తానే శివరామ్ కు ఫోన్ చేసి తండ్రిని ఇబ్బంది పెట్టొద్దని హెచ్చరించానని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరపాలని కోరారు.

Kodela siva prasad
Telugudesam
Sattenapalli
  • Loading...

More Telugu News