Sakshi channel: అలా గొడవపడ్డట్టు సాక్షి ఛానెల్ కి కలొచ్చిందేమో!: వర్ల రామయ్య

  • ‘ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది మరో దారి’
  • ‘సాక్షి’ ఛానెల్ అలాగే వ్యవహరిస్తోంది
  • రెండు రోజుల క్రితం కోడెల, కొడుకు గొడవపడ్డారట

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణం చెందినట్టు అన్ని ఛానెల్స్ ప్రచారం చేస్తే, ‘సాక్షి’ ఛానెల్ మాత్రం మరోలా ప్రసారం చేసిందని టీడీపీ నేత వర్ల రామయ్య నిప్పులు చెరిగారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది మరో దారి’ అన్నట్టుగా ‘సాక్షి’ ఛానెల్ వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.

రెండు రోజుల క్రితం కోడెల, ఆయన కొడుకు గొడవపడ్డారని ఆ ఛానెల్ లో ప్రసారం చేశారని, అలా గొడవపడ్డట్టు ‘సాక్షి’కి ఏమన్నా కలొచ్చిందేమో అని విమర్శించారు. ‘గొడవపడ్డ కారణంగా కోడెల బలవన్మరణానికి పాల్పడ్డారట. ‘నువ్వు (కోడెల) రా నీతో మాట్లాడాలి’ అని కొడుకు పిలిచాడట. పిలిచిన తర్వాత గొడవ పడ్డారట. తండ్రీ కొడుకులు కొట్టుకున్నారట. దాని పర్యవసానం ఈరోజున ఉరి వేసుకుని చనిపోయారు’ అన్నట్టు సాక్షి ఛానెల్ ప్రసారం చేసిందని, ‘అది ఛానెలా తాటిమట్టా’ అంటూ ధ్వజమెత్తారు.

Sakshi channel
Kodela siva prasad
varl ramaiah
  • Loading...

More Telugu News