Hyderabad: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కోడెల పార్థివదేహం.. నివాళులర్పించిన నేతలు!

  • కోడెల పార్థివదేహాన్ని సందర్శిస్తున్న నాయకులు
  • నివాళులర్పించిన బాలకృష్ణ, దేవినేని ఉమ తదితరులు
  • తరలివస్తున్న అభిమానులు, కార్యకర్తలు

ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పార్థివదేహానికి టీడీపీ నేతలు నివాళులర్పించారు. ఉస్మానియా ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించిన అనంతరం, కోడెల భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తరలించారు. ఆయన పార్థివదేహాన్ని సందర్శించేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, కోడెల అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నందమూరి బాలకృష్ణ, దేవినేని ఉమ, కేఈ కృష్ణమూర్తి తదితరులు నివాళులు అర్పించారు. కాగా, ఈరోజు రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు చేరుకోనున్నారు.  

Hyderabad
NTR Trust Bhavan
Kodela
Balakrishna
  • Loading...

More Telugu News